PDPL: మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలని ఎమ్మెల్యే విజయరమణారావు పిలుపునిచ్చారు. సోమవారం ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో మాదకద్రవ్యాల వ్యతిరేకతపై అవగాహన ర్యాలీ కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి జెండా చౌరస్తా మీదుగా ర్యాలీ జరుగుతుందన్నారు.