MDK: కురుమ సంఘం భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం పక్కనే విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా సంఘానికి పిల్లికొట్టాల చౌరస్తా డబుల్ బెడ్రూమ్ ఏరియాలో అనువైన స్థలం కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర షెఫర్డ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు నగేష్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.