HYD అమీర్పేట పరిసరాలు నీట మునిగే సమస్యకు పరిష్కారం దొరికిందని హైడ్రా అధికారులు వెల్లడించారు. అండర్ గ్రౌండ్లో పూడుకుపోయిన నాలాలను శుభ్రం చేయడంతో సమస్య తగ్గిందన్నారు. ఒకే చోట 25 లారీల పూడికను తొలగించామని చెప్పారు. ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకు 2,200 లారీల పూడికను తొలగించామని పేర్కొన్నారు. ఇది నిరంతరం కొనసాగుతోందన్నారు.