TG: టీజీఐసెట్-2025 చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. ఇవాళ విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. ఈ నెల 20న విద్యార్థులకు సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. కౌన్సెలింగ్కు వచ్చే విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలు తీసుకురావాలని అధికారులు పేర్కొన్నారు.