NLG: విముక్తి కోసం నాడు జరిపిన తెలంగాణ సాయుధ పోరాటానికి చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామం సజీవ సాక్ష్యంగా నిలిచింది. సయ్యద్ మక్బూల్ అనే రజాకార్ అరాచకాలను, దుర్మార్గాలను ఎదిరించి అతనిపై సాయుధ దళాలు దాడి చేయగా భార్య మరణించింది. దీంతో కోపోద్రిక్తుడైన సయ్యద్.. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన అనేకమందిని చంపి గ్రామంలోని కోటలో ఉన్న బావిలో పడేసినట్లు చరిత్ర చెబుతోంది.