VZM: పారిశుధ్య కార్మికుల ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేయాలని బొబ్బిలి ఇంఛార్జ్ MPDO అల్లు భాస్కరరావు సూచించారు. బుధవారం ఆయన స్దానిక జగన్నాథపురంలో చెత్త సేకరణను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరణ చేయాలని ఆదేశించారు. రోడ్లు, కాలువలలో చెత్త వేయకుండా గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలని ప్రజలను కోరారు.