SKLM: టెక్కలి జిల్లా ఆసుపత్రిలో సీటీ స్కాన్ సేవలు గత 2 రోజులుగా నిలిచిపోయి, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర కేసులకు మాత్రమే సర్వీసులు అందుతున్నాయి. ప్రైవేట్ సంస్థ సేవలు అందిస్తున్న ఈ కేంద్రంలో, ప్రభుత్వ బకాయిలు పెండింగ్లో ఉన్న కారణంగా సర్వీసులు నిలిపినట్టు సమాచారం. దీంతో రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.