NDL: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గురువారం నంద్యాలకు రానున్నట్లు ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు అఖిల్ మాదిగ తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాలలో జరిగే ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాలోని ఎమ్మార్పీఎస్ నాయకులు కార్య కర్తలు మందకృష్ణ మాదిగ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.