ప్రకాశం: ఒంగోలులోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 అంగీకార్ బ్రోచర్‌ను కమిషనర్ వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు సొంత ఇంటి కల నిజం చేసుకునే అవకాశం ఇవ్వడమే పథకం లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు, కేంద్రం రూ.1,50,000 విడతల వారీగా లబ్ధిదారునికి అందజేస్తుందని ఆయన తెలిపారు.