కృష్ణా: దేవాలయాల కమిటీ సభ్యులుగా నియమితులైన వారు పాలకులుగా కాక దైవ చింతనతో, సేవకులుగా దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాలు బుధవారం ఘనంగా నిర్వహించారు.