KDP: ప్రొద్దుటూరు గీతాశ్రమంలో బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. యువత రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడాలని తెలిపారు. ఈ క్రమంలో యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. అనంతరం రక్తదాన శిబిరంలో 82 మంది రక్తదానం చేశారు.