SKLM: నరసన్నపేట ఏరియా హాస్పిటల్లో 22వ తేదీన మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని సూపరింటెండెంట్ సిపాన శ్రీను బాబు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ శిబిరంలో 8 మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులు పాల్గొంటున్నారని అన్నారు. ‘స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్’ ఈ కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.