KRNL: హాలహర్వి మండలం చింతకుంటలో ప్రభుత్వ పాఠశాలకు సీసీ రహదారి నిర్మించాలని SFI , DYFI నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పాఠశాల విద్యార్థులతో కలిసి రహదారిపై నిరసన చేశారు. విద్యార్థి నాయకుడు మైన మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించి రహదారి నిర్మించాలన్నారు. వర్షం సమయంలో పాఠశాలకు వెళ్లడానికి విద్యార్థులు ఇబ్బందులు ఎదురుకుంటున్నారని తెలిపారు.