VZM: ఈనెల 19న (శుక్రవారం) ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపారు. ఉద్యోగులు తమ సమస్యలపై ధరఖాస్తులను అందజేయవచ్చునని సూచించారు.