రానా దగ్గుబాటి డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మరాఠీ సినిమా ‘సబర్ బొండా’ శుక్రవారం విడుదల కాబోతుంది. ఇలాంటి ఇండిపెండెంట్ మూవీలు చూసే ప్రేక్షకులు దేశవ్యాప్తంగా చాలా మంది ఉన్నారని రానా చెప్పారు. దర్శకుడు తాను అనుకున్న కథను నిజాయితీగా తెరకెక్కించాడని, ఇది ప్రేక్షకుడిని కదిలిస్తుందని నమ్మకం ఉందని తెలిపారు. ప్రస్తుతానికి మహారాష్ట్రలో దీని రిలీజ్ ప్లాన్ చేశామని అన్నారు.