ATP: MPR డ్యామ్‌కు వెంటనే మరమ్మతులు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెన్నప్ప యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం గార్లదిన్నె సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. MPR డ్యామ్ గేట్లు చాలాకాలంగా పనికి రాకపోవడం వల్ల నీటి లీకేజీలు జరుగుతున్నాయన్నారు. డ్యామ్ వద్ద సరైన మరమ్మత్తులు చేసి నీటి లీకేజీలను అరికట్టాలన్నారు.