SKLM: నరసన్నపేట మేజర్ పంచాయతీ జగన్నాథపురం వీధిలో సీసీ రోడ్డు పనులను ఉపసర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ. రెండు లక్షలు ఈ రోడ్డు నిర్మాణానికి కేటాయించినట్లు ఆయన తెలిపారు. శిథిలావస్థకు చేరుకున్న రోడ్లను ప్రథమ ప్రాధాన్యతనిస్తూ చేపడుతున్నామన్నారు.