NRML: జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 352.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు బుధవారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా నిర్మల్ రూరల్ లో 78.8, ముధోల్‌లో 58.0 మీ. మీటర్లు కురువగా, మామడలో 38 మీ. మీటర్లు, సోన్‌లో 31.4మీ. మీటర్లు, సారంగాపూర్‌లో 28.2, నిర్మల్‌లో 25.4 మీ. మీటర్లు, అతి అల్పంగా ఖానాపూర్, కడెంలో 1 మీ. కురిసింది.