NDL: బనగానపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో ప్రభుత్వ వక్ఫ్ బోర్డు భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని బనగానపల్లె తహసీల్దార్ నారాయణరెడ్డి వెల్లడించారు. మంగళవారం సాయంత్రం పట్టణ సమీపంలో వక్ఫ్ బోర్డు భూములను ఆయన పరిశీలించారు. ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎవరైనా మోసం చేసి అక్రమించాలని చూస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.