GNTR: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భగవాన్ విశ్వకర్మ, గాయత్రీ మాత చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.