SRD: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో బైక్ ర్యాలీ బుధవారం నిర్వహించారు. ప్రభుత్వ అతిథిగృహం వద్ద పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కారాములు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జయరాజ్ పాల్గొన్నారు.