AP: గుంటూరు తురకపాలెంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం తాగునీటి సరఫరా కేంద్రాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఇప్పటికే 1,050 మందికి రక్త పరీక్షలు చేశామని వెల్లడించారు. మూడు నెలల వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని తెలిపారు. వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.