అన్నమయ్య: మండల స్థాయి స్కూల్ గేమ్స్ సాయిపోటీలలో మదనపల్లె జడ్పీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి డివిజన్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని స్పోర్ట్స్ కోఆర్డినేటర్లు శివశంకర్, లత మంగళవారం తెలిపారు. స్థానిక జెడ్పీ స్కూల్లో జరిగిన బ్యాడ్మింటన్ అండర్-14, అండర్-17 బాల, బాలికల పోటీలలో మదనపల్లె జడ్పీ స్కూల్ల విద్యార్థులు పాల్గొన్నారు.