TPT: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని మాజీ మంత్రి ఆర్కే రోజా, సినీ నటి రవళి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.