ELR: కామవరపుకోట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు MPDO సరళ కుమారి సోమవారం తెలిపారు. మండల పరిషత్ అధ్యక్షురాలు మేడవరపు విజయలక్ష్మి అశోక్ అధ్యక్షత వహిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి MLA రోషన్ కుమార్, ఏలూరు MP మహేశ్ కుమార్ హాజరవుతారన్నారు. అన్ని శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని కోరారు.