SKLM: “నారీ శక్తి” అనే కార్యక్రమం ద్వారా మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జే. ఆర్. పురం ఎస్సై ఎస్. చిరంజీవి తెలిపారు. సోమవారం రాత్రి సంచాం పంచాయతీ పెసరపాలెం గ్రామంలో అవగాహన కల్పించారు. శ్రీకాకుళం ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామాలు, పట్టణాలలో అవగాహన కల్పిస్తున్నామన్నారు.