PPM: గరుగుబిల్లి మండలం నందివానివలస సమీపంలో ఎదురుగా వస్తున్న బస్సు ను తప్పించబోయి బైక్ అదుపుతప్పి బోల్తా పడడంతో గిజబ గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్ మరడాన ఆదినారాయణ మృతి చెందాడు. ఖడ్గవలసలో పెట్రోల్ బంక్ యజమానిగా ఉంటూ పనులు ముగించుకొని రాత్రి ఇంటికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన విషయం తెలియడంతో గ్రామంలో విషాదం నెలకొంది.