VZM: కొత్తవలస మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నేడు 2024,25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన పనులపై ఆడిట్ బహిరంగ చర్చ జరుగుతుందని మండల పరిషత్ అభివృద్ది అధికారి ఎస్. రమణయ్య తెలిపారు. సమావేశం 10 గంటలకు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి మండలంలో ఉన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.