ADB: మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్‌ను మాజీ TPCC ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత హైదరాబాదులో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీలో తిరిగి చేరటం పట్ల కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బలోపేతం అవుతుందని మధు యాష్కి తెలిపారు. అనంతరం జిల్లాలోని తాజా రాజకీయ అంశాలను చర్చించినట్లు సుజాత పేర్కొన్నారు. మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సంజీవరెడ్డి, ఆశన్న తదితరులున్నారు.