AP: తమ నియోజకవర్గాల్లో భూగర్భ జలాలు పెరిగేలా ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. గతేడాదితో పోల్చితే ఈసారి భూగర్భ జలాల స్థాయి పెరిగిందన్నారు. పోలవరంలో ముంపునకు గురయ్యే ఏడు మండలాలు ఏపీకి ఇవ్వకపోతే సీఎంగా ప్రమాణం చేయబోనని 2014లో కేంద్రానికి స్పష్టం చేశానని గుర్తుచేశారు. పోలవరం పనుల్లో గిన్నిస్ రికార్డు కూడా సృష్టించామని అన్నారు.