NZB: జిల్లా వ్యాప్తంగా దసరా పండుగ సెలవుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. రద్దీ ప్రదేశాలలో అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని, రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరిగేవారిని ప్రశ్నించాలని తెలిపారు. శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇళ్లపై దొంగలు పడే అవకాశం ఉన్నందున, ఇరుగుపొరుగు వారిని అప్రమత్తంగా ఉండమని చెప్పాలని సూచించారు.