VSP: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం వినూత్న నిరసన చేపట్టారు. పీపీపీ విధానం వలన పేద విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యకు దూరమవుతారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ ఆవేదన వ్యక్తం చేశారు.