అన్నమయ్య: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం మదనపల్లి మెడికల్ కళాశాల వద్ద వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా చంద్రబాబు హయాంలో కొత్త మెడికల్ కాలేజీలు రాలేదని, వైసీపీ ప్రభుత్వంలో ఐదు కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు.