KDP: భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మైదుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఇంజనీర్స్ డేను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ శ్రీ జి. అప్పారావు విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని దేశానికి నిస్వార్థ సేవ చేయాలని, క్రొత్త ఆవిష్కరణలు చేయాలని ఆకాంక్షించారు.