KRNL: కర్నూలు మార్కెట్ యార్డుకు ఇవాళ సెలవు ప్రకటించామ ని, క్రయవిక్రయాలు జరగబోవని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని జేసీ డాక్టర్ బి.నవ్య సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్కుఫెడ్ కొనుగోలు చేసిన 2,500 టన్నుల ఉల్లికి మంగళవారం బహిరంగ వేలం వేయ నున్నట్లు చెప్పారు. ఈ వేలంలో రిటైలర్స్, హోల్సేల్ వ్యాపారులు, హోటల్ యాజమానులు పాల్గొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు.