NLR: శరన్నవరాత్రుల సందర్భంగా కార్పొరేటర్ నుంచి ఏ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు నెల్లూరు రాజారాజేశ్వరి ఆలయంలో అమ్మ వారి దర్శనానికి టికెట్టు తీసుకుని వెళ్లాల్సిందేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం పార్టీ కార్పొరేటర్లకు, ఇతర పదవుల్లో ఉన్న వారిని ఆదేశించారు. భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఆలయ నిర్వాహకులకు కూడా దిశ, నిర్దేశం చేశారు.