TPT: వాకాడు మండల ప్రజాపరిషత్ అధికారిగా M. సాయి ప్రసాద్ నియమితులయ్యారు. సాయి ప్రసాద్ నెల్లూరు జిల్లాలో ఈవోపీఆర్డీ (డిప్యూటీ ఎండిఓ)గా పనిచేస్తూ పదోన్నతిపై ఎంపీడీవో అయ్యారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరాలుగా వాకాడులో ఎంపీడీవోగా ఇన్ఛార్జ్ కొనసాగుతున్నారు. ఇప్పుడు పూర్తి బాధ్యతలతో M. సాయి ప్రసాద్‌ను నియమించారు. నూతన ఎంపీడీవోకి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.