TG: కొత్తగూడెం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని వెల్లడించారు. అవసరమైన భూమిని సేకరించి అందించినట్లయితే విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.