VZM: పేదరిక నిర్మూలనే పీ-4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జేసీ ఎస్.సేతు మాధవన్ స్పష్టం చేశారు. మార్గదర్శులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని, వారిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. పీ-4 కార్యక్రమం, బంగారు కుటుంబాలు, మార్గదర్శుల పాత్రపై కలెక్టరేట్లో ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.