VZM: పశు వ్యాధుల పట్ల పాడి రైతులకు వైద్యులు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే బేబీ నాయన కోరారు. బొబ్బిలి కోటలో ఆయన మంగళవారం జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం పోస్టర్లను ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు గాలికుంటు వ్యాదులు సోకకుండా టీకాలు వేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పశు వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని కోరారు.