VZM: ఆసుపత్రి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యులకు ఎమ్మెల్యే కోళ్ల లలిత ఆదేశించారు. మంగళవారం అవుట్ పేషెంట్ విభాగంలో ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ నిధులతో కొనుగోలు చేసి ఏర్పాటు చేసిన కుర్చీలను తన చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యటిస్తూ ప్రజలకు అందుతున్న సేవలను అడిగారు.