CTR: పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దని కమిషనర్ పి నరసింహ ప్రసాద్ చెప్పారు. మంగళవారం ఉదయం కమిషనర్ నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. వెంగళరావు కాలనీలో వర్షపు నీరు వీధిల్లో నిలుస్తుందనే ఫిర్యాదుపై పరిశీలించారు. స్థానికంగా మురుగునీటి కాలువలను పరిశీలించి, చేపడుతున్న పారిశుద్ధ్య పనులపై సంబంధిత అధికారులతో మాట్లాడారు.