NLG: మర్రిగూడలోని శివన్నగూడెం ప్రాజెక్టు పనులపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్ ఫోరం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్పై సర్వే చేసి డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని పేర్కొన్నారు.