SKLM: బూర్జ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సాధారణ సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు.