పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్లు ఆడొద్దని భారత్లో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం 2028 ఒలింపిక్స్లో క్రికెట్ చేరింది. అలాగే, 2030 కామన్వెల్త్ క్రీడలు, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్ పోటీపడనుంది. ఇలాంటి సమయంలో పాక్తో ఆడం, మ్యాచ్లను బహిష్కరిస్తామంటే ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులు పొందే అవకాశాలు ఉండవు.