W.G: నరసాపురం మండలం తూర్పు తాళ్ల గ్రామంలో ఇటీవల గణేష్ నిమజ్జనంలో చోటుచేసుకున్న ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు ఏపీ గణేష్ ఉత్సవ కమిటీ అండగా నిలిచింది. బాధిత కుటుంబ సభ్యులను ఏపీ గణేష్ ఉత్సవ కమిటీ సోమవారం పరామర్శించి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున రూ.2 లక్షలను నాలుగు కుటుంబాలకు అందజేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు