ఐటీఆర్ దాఖలు గడువును పొడిగిస్తూ ఆదాయపు పన్ను విభాగం నిర్ణయం తీసుకుంది. సోమవారంతో గడువు ముగియగా.. కేవలం ఒక్కరోజు (సెప్టెంబర్ 16) పొడిగించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను విభాగం ప్రకటించింది. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో యూజర్ల ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదాయపు పన్ను విభాగం తెలిపింది.