AP: విద్యార్థిని అల్లరి చేస్తోందని ఉపాధ్యాయుడు కొట్టడంతో బాలిక తలకు గాయమైంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న సాత్విక తలపై టీచర్ స్కూల్ బ్యాగుతో కొట్టాడు. దీంతో తలనొప్పి రావడంతో ఆమెను పుంగనూరులో ఓ ఆసుపత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లగా, బెంగళూరు వెళ్లాలని సూచించారు. బాలికను బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చూపించగా పుర్రె ఎముక చిట్లినట్లు పరీక్షల్లో తేలింది.