SRD: నిరాశ్రయులు, వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో యాత్రదానం పోస్టర్ను సోమవారం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఆర్థిక స్తోమత లేని వారికి పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే అవకాశం కల్పించేందుకు దాతలు ముందుకు వస్తే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుందన్నారు.