W.G: నరసాపురం మండలం సీతారాంపురం సౌత్ ఎస్టీ కాలనీలో నివాసముంటున్న వారికి ఆధార్ కార్డులు మంజూరు చేయాలని కాలనీవాసులు సోమవారం గ్రామ సచివాలయం వద్ద ధర్నా చేశారు. కాలనీ వాసులు మాట్లాడుతూ.. సమాజంలో అట్టడుగున జీవిస్తున్న వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. గ్రామంలో ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసి తమకు ఆధార్ కార్డులు మంజూరు చేయాలన్నారు.